సోమవారం సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లో రూ.11.76 కోట్లతో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనం, భోజనశాల, నాలుగు వరుసల రోడ్డు మరియు ఇతర సౌకర్యాలు ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోనే అతి పెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ వరంగల్, సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మంత్రి కేటీఆర్.
నేతన్నకు జీవనోపాధి కలిగించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నాం. కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చేనేత, టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సీడీ ఇస్తాన్నామన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం నేతన్నల కోసం చేసింది. 14.50 కోట్లతో టెక్స్ టైల్ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభించాం. తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తుంది.
కరోన నేపథ్యంలో కార్మికులు వెళ్లి పోతుంటే పరిశ్రమలకు ఇబ్బందులు పడతాయి. లాభాలు ఆర్జిస్తూన్న యజమానులు కార్మికుల శ్రేయస్సు చూడాలి. ఈ ప్రాంత పారిశుధ్యం యజమానులదే బాధ్యత. యజమానులు కార్మికులతో ఒప్పందం చేసుకున్న విధంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పరంగా చేయుతను అందిస్తాం. కేంద్రం సాయం కోరుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాయడం జరిగింది. కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకుంటుంది. కార్మికులను గౌరవంగా చూసుకోవాలి. సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి తెలియలనే ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.