పర్యావరణహిత చర్యలకు ప్రతి ఒక్కరు పాటుపడాలి..

375
environment
- Advertisement -

పర్యావరణహిత చర్యలకు ప్రభుత్వాలు, సంస్థలే కాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం ఉండాలంటే ఇప్పటితరం తన తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఆంటోనిరాజా పిలుపునిచ్చారు.

హైద్రాబాద్ సింగరేణి భవన్లో బుధవారం ఉదయం జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏటి నినాదం ‘‘వాయు కాలుష్య నివారణ’’ కనుక దీనిని తగ్గించడానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కాలుష్య కారకవాహనాల వినియోగం తగ్గించాలని, పూల్ వాహనాలు వాడాలని కోరారు.

సి.ఎం.ఓ.ఎ.ఐ. జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖర్ రావు మాట్లాడుతూ పర్యావరణానికి జంతువులు చేస్తున్న మేలును కూడా మనుషులు చేయలేకపోవడం బాధకరమన్నారు. జీవవరణ సమత్యల్యతకు మానవులు తీవ్ర నష్టం కల్గిస్తున్నారనీ, ఈ పద్ధతులకు ఇక మానవజాతి స్వస్తి పలకకపోతే ప్రపంచం మనుగడ ప్రశ్నార్ధకమేనన్నారు.

కవి, గాయకుడు జయరాజు తన పాటల ద్వారా పర్యావరణ పరిరక్షణ అవశ్యకతను చక్కగా వివరించారు. కె.వి.రమణ ప్రతిజ్ఞా స్వీకారం నిర్వహించారు. కార్యక్రమంలో డి.జి.ఎం. పర్చేజ్ విజయేందర్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ దుండె వెంకటేషం, పి.ఆర్.ఓ. బుడగం మహేష్, అడ్మిన్ మేనేజర్ ఎన్.భాస్కర్, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి కార్యక్రమానికి వాఖ్యాతగా వ్యవహారించారు.

- Advertisement -