ISRO:ప్రపంచమంతా ఇస్రో నామజపం!

53
- Advertisement -

ప్రస్తుతం ప్రపంచమంతా ఇస్రో పేరు మారు మ్రోగుతోంది. చంద్రయాన్ 3 విజయం సాధించడంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొట్టమొదటి దేశంలో చరిత్రలో ఇండియా నిలిచి పోయింది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలం అయినప్పటికి నిరాశ చెందకుండా అందులోని లోపాలను సవరించుకొని రెట్టించిన దైర్యంతో చంద్రయాన్ 3 కి శ్రీకారం చుట్టింది ఇస్రో. 615 కోట్ల బడ్జెట్ తో శ్రీకారం చుట్టిన చంద్రయాన్ 3 గత నెల 14 న జాబిల్లి టార్గెట్ గా నింగిలోకి దూసుకెళ్లింది. 40 రోజుల సుధీర్ఘ ప్రయాణం తరువాత అన్నీ అడ్డంకులు అదిగమించి ఆగష్టు 23 ( నిన్న ) చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టింది..

దాంతో చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు చంద్రుడి సమగ్ర సమాచారాన్ని భూమికి చేరవేయడమే చంద్రయాన్ 3 తదుపరి విధి. ఈ ప్రయాగ విజయం తరువాత ఇస్రో చేపట్టబోయే తదుపరి ప్రయోగాలపై ప్రపంచమంతా క్యూరియాసిటీ నెలకొంది. ఇక నెక్స్ట్ ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ఇస్రో ఇప్పటికే స్పష్టతనిచ్చింది. ఇది సూర్యుడిపై పరిశోదనల నిమిత్తం ఈ ప్రయోగం చేయనున్నారట.

సూర్యుడి ఉనికి, సౌర తుఫానులకు గల కారణాలు వంటి వాటిపై ఆదిత్య ఎల్ 1 అధ్యయనం చేయనుంధి. ఆ తరువాత గగన్ యాన్ ప్రయోగం కూడా ఈ ఏడాదే చేపట్టనున్నట్లు ఇస్రో చెప్పుకొచ్చింది. మానవులను అంతరిక్షనికి పంపడం గగన్ యాన్ లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో పాటు శుక్రుడిపై కూడా పరిశోదనలకు ఇస్రో రెడీ అవుతుందట. ఇంకా మంగళ్ యాన్ 2, చంద్రయాన్ 4 వంటి ప్రాజెక్ట్స్ కూడా లిస్ట్ లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:కామారెడ్డి బరిలో రాములమ్మ..నిలబడేనా?

- Advertisement -