బ్రతికి ఉన్ననాళ్లు ఎలాంటి రోగాల బారిన పడటం సవాల్‌తో కూడుకున్నదే. అయితే కొన్ని వ్యాధులకు మందులు ఉండగా మరికొన్ని వ్యాధులకు మందులు లేవు. అందులో ఒకటే ఎయిడ్స్. రక్షణ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం, హెచ్ఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలను ఇతరులకు వాడడం, హెచ్ఐవీ సోకినవారి రక్తాన్ని మరొకరిని ఎక్కించడం ద్వారా హెచ్ఐవీ సోకుతుంది.
అలాగే, హెచ్ఐవీ ఉన్న తల్లుల నుంచి పిల్లలకు సోకుతుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, కాన్పు సమయంలో లేదా తల్లిపాల ద్వారా బిడ్డకు సోకవచ్చు. సుఖవ్యాధులు (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్- STD) ఉన్నవారికి హెచ్ఐవీ సోకే రిస్క్ ఎక్కువ.ముఖ్యంగా లైంగిక సంపర్కం వల్లే ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
యునైటెడ్ స్టేట్స్‌లో 1981లో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆ తర్వాత 1984లో హెచ్‌ఐవీ వైరస్‌ని కనుగొన్నారు.ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితే జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు.
ప్రాణాంతకమైన ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే 18న ఎయిడ్స్ వ్యాక్సిన్ డే గా డిసెంబర్ 1న ఎయిడ్స్ అవగాహన డేగా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించే చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. సురక్షితమయిన శృంగారం ఎంతో మేలు.
Also Read:ప్రతిరోజూ శనగలు తింటే ఎన్ని లాభాలో!