కేటీఆర్ కలిసిన వండర్ బేబీ ఉపాసన

15
- Advertisement -

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వండర్ బేబీ ఉపాసన, ఆమె తల్లిదండ్రులు ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెండున్నర సంవత్సరాల బేబీ ఉపాసన తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రతిభాపాటవాలతో నోట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థల చేత గుర్తించబడింది. ఆమె మహనీయుల పేర్లు వారి చిత్రపటాలను గుర్తించుకోవడం, దేశ రాజధానులు, ప్రపంచ రాజధానుల వంటి అనేక అంశాల్లో అద్భుతమైన ప్రజ్ఞను కలిగి ఉంది. ఈరోజు కేటీఆర్ ని కలిసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో కూడిన కేసీఆర్ చిత్రపటానికి చెందిన పజిల్ వేగంగా కలిపి కెసిఆర్ చిత్రపటాన్ని తయారుచేసి చూపించింది. బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడే బేబీ ఉపాసన ప్రజ్ఞ పాటవాలను చూసి కేటీఆర్ తో పాటు పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కెసిఆర్ తాతను కలిసి మాట్లాడతా అంటూ బేబీ ఉపాసన తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.

ఇంత చిన్న వయసులో మహనీయుల పేర్లు, చిత్రపటాలతో పాటు భౌగోళిక అంశాల పైన ఆమెకున్న జ్ఞాపకశక్తిని, టాలెంట్ ని చూసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. బేబీ ఉపాసన భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలని దీవించారు. బేబీ ఉపాసన సాధించిన రికార్డుల పత్రాలపైన ఆమె తల్లిదండ్రులు కేటీఆర్ సంతకాన్ని ఒక జ్ఞాపకంగా తీసుకున్నారు. బేబీ ఉపాసనకు మంత్రి కేటీఆర్ దీవెనలతో పాటు మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కో చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Also Read:2024: శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు

- Advertisement -