మహిళలకు గుండెపోటు..లక్షణాలివే!

6
- Advertisement -

గత కొద్ది రోజులుగా 40 ఏళ్ల లోపు వయసు కలిగిన యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా వృద్ధుల్లోనే కనిపించే గుండెపోటు, ఇప్పుడు యువతలో పెరుగుతుండటంతో భయం, అప్రమత్తత ఒకేసారి పెరుగుతున్నాయి.

అయితే గుండెపోటు లక్షణాలు పురుషులు, మహిళల్లో గుండెపోటు లక్షణాలు వేర్వేరుగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో గుండెపోటు లక్షణాలు సున్నితంగా ఉండి సులభంగా గుర్తించరాని విధంగా ఉంటాయి. మహిళల్లో గుండెపోటు లక్షణాలు తరచుగా వాంతులు, నడుము లేదా దవడ నొప్పి, అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కనిపిస్తాయి.

ఇలాంటి లక్షణాలను చాలామంది చిన్న సమస్యగా లేదా ఒత్తిడి కారణంగా భావిస్తారు. కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. చాలాసార్లు నేను అనుకున్నది గుండెపోటు కాదనుకున్నా, తర్వాత అది గుండెపోటుగా నిర్ధారణ అవుతుందన్నారు.

Also Read:రోహిత్ వారసుడిగా శ్రేయాస్!

అయితే మహిళల్లో ఛాతీ నొప్పి తప్పనిసరి లక్షణం కాదని,సాధారణ పనులు చేయకపోయినా అలసట, శ్వాస ఆడకపోవడం,నడుము, దవడ, భుజం, మెడ లేదా కడుపులో నొప్పి,తలతిరగడం లేదా వాంతులు రావడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఈ లక్షణాలను చిన్నగా తీసుకోకూడదు. అనుమానం వచ్చినప్పుడు వెంటనే వైద్య సహాయం పొందడం అత్యవసరం.

- Advertisement -