- Advertisement -
ఇండియాలో రోజురోజుకి కరోన వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా కాకినాడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కాకినాడలో కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతి చెందింది. అంతర్వేదిపాలెంకు చెందిన ఆ మహిళ ఇటీవలే దుబాయ్ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చింది. జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో ఆమెను కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
కరోనా వైరస్ సొకిందనే అనుమానంతో ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -