మహిళల భద్రత..ఫిర్యాదుల కోసం క్యూ ఆర్ కోడ్..

188
sumathi
- Advertisement -

ప్రభుత్వం మహిళల భద్రతకు ఎంతో ప్రాధాన్యత నిస్తోంది. షీ టీమ్స్‌తో మహిళల భద్రతకు ప్రాముఖ్యతనిస్తుండగా తాజాగా బాధితులకు మరింత చేరువయ్యేందుకు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తీసువచ్చింది. క్యూఆర్ కోడ్‌ స్కాన్‌ చేస్తే నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందుతుంది. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతితో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

డీఐజీ సుమతి మాట్లాడుతూ.. మహిళలు, యువతులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసేందుకు తమ పరిధిలోని వాట్సప్ నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేస్తే దాంతో ఫిర్యాదుల ఫేజ్ ఓపెన్ అవుతుంది.. ఇందులో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే షీ టీమ్స్‌ సెంట్రల్ సర్వర్‌కు చేరుతుందని ఆమె వివరించారు.

- Advertisement -