ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నన్ను చంపిస్తావా అంటూ టీడీపీ ఎమ్మెల్యేతో మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమాషా చేస్తున్నావా.. ఎవరు అనుకుంటున్నావు నేను, నీ కమాండ్ ఏంటి అంటూ మహిళతో ఎమ్మెల్యే రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
ఇదంతా శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని బండి ఆత్మకూరు మండలంలో జరిగింది. అయ్యవారి కోడూరు గ్రామంలో భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు భారతి అనే మహిళ.
తన మనవడు అనారోగ్యంతో ఉండడంతో.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్తే అప్లికేషన్ తీసుకోలేదని నిలదీయడంతో.. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు మహిళ. వాగ్వాదం పెరగడంతో ఎస్ఐని పిలిపించి ఆమెను పంపించేశారు ఎమ్మెల్యే. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధం

