తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు : మంత్రి హరీశ్‌రావు

85
harish
- Advertisement -

తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీ లేదు. అవి అమృతంతో సమానమన్నారు. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో మిల్క్‌ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు.

కేవలం 36 శాతం మంది మత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారు. 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారు. సీ సెక్షన్ ఆపరేషన్ల వల్ల ఇది జరుగుతుందన్నారు. నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి. కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయమంటున్నారు. మరి కొందరు మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇవేవి సరైన పద్ధతులు కావన్నాయన….. వైద్యుల సూచన మేరకే ముందుకెళ్లాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, సర్పంచ్‌లు గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో 45 శాతం సి సెక్షన్ జరుగుతోంది. 55 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మదర్ మోర్టలిటీ రేట్ లో తమిళనాడును అధిగమించామని గుర్తు చేశారు. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి 3 వేల రూపాయల ప్రోత్సాం అందిస్తున్నామని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరం కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -