ప్రకృతి ఒడిలో సహజసిద్ద ఔషధ గుణాలు కల్గివున్న వాటిలో కలబంద ( ఆలోవెరా ) కూడా ఒకటి. ఆలోవెరాను వివిధ రకాల చర్మ సంబంధిత మెడిసన్స్ లో వాడుతుంటారు. కలబంద.. గ్లిసరిన్, సోడియం ఫామాల్, సోడియం కార్బొనేట్, ఫామ్ కెమెలెట్ సర్బిటోల్ వంటి గుణాలను కల్గి ఉంటుంది. ఇవన్నీ కూడా వివిద రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే చర్మ సమస్యలకు సంబంధించి ఏ మెడిసన్ తీసుకున్న అందులో ఆలోవెరా కారకాలు కచ్చితంగా ఉంటాయి. ఇక వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలు అన్నీ ఇన్ని కావు. చర్మం పేలగా తయారవడం, మొఖంపై నల్లటి ఛాయలు, మచ్చలు, మొటిమలు ఎలా ఎన్నో సమస్యలు వేదిస్తాయి. అందువల్ల అన్నీ చర్మ సమస్యలకు చెక్ పెట్టె ఆలోవెరా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రిరాడికల్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. వేసవిలో చెమట పట్టడం సర్వసాధారణం.. చెమట కారణంగా చెమటకాయలు, దురద, అలెర్జీ, దద్దుర్లు వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ఈ చర్మంపై ఈ సమస్యలు ఏర్పడినప్పుడు ఆలోవెరా గుజ్జును అక్కడ రాయడం వల్ల.. బ్యాక్టీరియాతో పొరాడి ఆ సమస్యల నుంచి కలబంద విముక్తి కలుగజేస్తుంది.
Also Read: BRS:నల్గొండ బీఆర్ఎస్ నేతల అరెస్ట్
ఇక వేసవిలో మొఖం పాలిపోవడం, నల్ల మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలతో కూడా భాద పడుతుంటారు చాలామంది. అలాంటి సమస్యలకు కూడా ఆలోవెరా ఒక చక్కటి పరిష్కారం. ఆలోవెరా లోని గుజ్జును పేస్ట్ ల మొఖానికి అప్లై చేయడం వల్ల మొఖం నిగారింపును సొంతం చేసుకోవడంతో పాటు నల్ల మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోతాయి. అంతే కాకుండా కలబంద చర్మానికి ఒక మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. కాబట్టి వేసవిలో వేదించే చర్మ సమస్యల నుంచి కలబంద ద్వారా చక్కటి పరిష్కారం పొందవచ్చు.