ధోనీని మరిచిన విజ్డెన్‌ మ్యాగజైన్‌

206
- Advertisement -

భారత్‌కు తొలి టీ20 వరల్డ్‌ కప్‌ను అందించిన ధోనీని ఎవరైనా మర్చిపోతారా అంటే ఎవరు మర్చిపోరు. కానీ క్రికెట్‌ బైబిల్‌ అని పిలువబడే విజ్డన్‌ మ్యాగ్‌జైన్ మాత్రం మర్చిపోయింది. విజ్డన్‌ మ్యాగ్‌జైన్‌ భారత ఆటగాళ్ల నుంచి ఆల్‌ టైమ్‌ టీ20 జట్టును ఎంపిక చేసింది. అయితే గమ్మతైన విషయం ఏంటంటే మిస్టర్‌ కూల్‌ ధోనీని మాత్రం ఆ జాబితాలో పేరును చేర్చలేదు. ధోనికి బదులుగా దినేష్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల సదరు పత్రిక సర్వత్రా విమర్శలు పాలవుతుంది.

2007 నాటి వరల్డ్‌ చాంఫియన్‌ నుంచి నలుగుర్ని, ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్ళిన జట్టు నుంచి ఏడుగురిని తీసుకుని ఆల్‌ టైమ్‌ టీ20జట్టుగా ప్రకటించింది. ఇందులో రోహిత్‌ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, హార్డిక్‌పాండ్యా, సురేష్‌రైనా, దినేష్‌ కార్తీక్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అశిష్‌ నెహ్రా, వీరేందర్‌ సెహ్వాగ్‌ ఉన్నారు. కానీ ఇందులో మహేంద్ర సింగ్‌ ధోని లేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సదరు పత్రిక యాజమాన్యం పలు కారణాలను తెలిపింది.

- Advertisement -