మహా అయితే జీవితం మొత్తం మీరు ఎన్ని బర్గర్లు తినగలరు. మీరు తినగలరో కానీ విస్కాన్సిన్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 30 వేల బర్గర్లు తిని గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు. 64 ఏళ్ల డాన్ గోర్స్కె అనే వ్యక్తి 46 సంవత్సరాలలో 30వేల బర్గర్లు తిని అందరిని ఆశ్చర్య పరుస్తూ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల కిందట మొదటగా బర్గర్ తిన్నాడతడు.
1972 మే 17 నుంచి మొదలుపెట్టి ఆ రోజు నుంచి ప్రతి రోజూ కనీసం ఒక్క బర్గర్ అయినా తాను తిన్నట్లు చెప్పుకొచ్చాడు. గోర్స్కె తిన్నప్పుడల్లా గుర్తుండేలా కేలండర్ లో రాసుకునేవాడు. ఆ బర్గర్కి సంబంధించిన బాక్స్ లేదా పే బిల్లులను దాచిపెట్టుకునేవాడు. ఈ క్రమంలో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గోర్స్కె రికార్డును గుర్తించింది.
2016లోనే అత్యధిక బర్గర్లు (28788) తిన్న వ్యక్తిగా ప్రకటించింది. తాజాగా స్థానిక మెక్ డొనాల్డ్స్ ఔట్లెట్లలో 30 వేల బర్గర్లు తిని మరో రికార్డు నెలకొల్పాడు. అయితే హామ్బర్గర్స్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఇన్ని తిన్నట్లు గోరెస్కె తెలియజేశాడు. ఎన్ని బర్గర్లు తిన్నా… ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదన్నారు.