వేసవిలో కూల్ కూల్ గా నిమ్మరసం?

20
- Advertisement -

నిమ్మకాయను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాము. నిమ్మకాయతో రుచికరంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని ఆరగిస్తుంటాము. అలాగే నిమ్మకాయతో జ్యూస్ తయారు చేసుకొని ఎనర్జీ డ్రింక్ లా తాగుతుంటాము. అలాగే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ.. ఇతరత్రా ఏ వంటకమైన నిమ్మకాయ లేకపోతే రుచి లోపిస్తుంది. అందుకే నిమ్మకాయను అన్నీ రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తుంటాము. అంతే కాకుండా నిమ్మను ఆయుర్వేదంలో కూడా వివిధ రోగాల నిమిత్తం వాడుతుంటారు ఆయుర్వేద వైద్యులు. కేవలం నిమ్మ రసంలోనే కాకుండా దాని తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సాధారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా సేవిస్తుంటాము. ఎందుకంటే శరీరం డిహైడ్రేట్ కాకుండా నిమ్మరసం శక్తినిస్తుంది.

అయితే వింటర్ లో కూడా నిమ్మరసం తాగడం ఎంతో మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మకాయలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇలా అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వింటర్ లో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శీతాకాలంలో తరచూ వేధించే వైరల్ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ప్రతిరోజూ ఉదయం గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. ఇక నిమ్మ రసం ప్రతిరోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇతరత్రా జీర్ణ సమస్యలు అన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా వింటర్ లో చర్మ సంరక్షణకు నిమ్మరసం ఎంతగానో తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వింటర్ లో రోజుకు ఒక్కసారైనా నిమ్మరసం తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:కేసీఆర్..కేసీఆర్..ప్రజల నుండి అనూహ్యస్పందన

- Advertisement -