చలికాలంలో బాడీ పెయిన్స్ కు చెక్ పెట్టండిలా!

54
- Advertisement -

ఒళ్ళు నొప్పులు చాలా మందిని వేధించే సాధారణ సమస్యలు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కళ్ళు చేతులు లాగడం.. ఇలా చాలా సమస్యలు ఆయా సందర్భాల్లో వేధిస్తుండతాయి. ఎక్కువ సేపు పని చేసినప్పుడు లేదా, వ్యాయామం చేసినప్పుడు ఈ రకమైన ఒళ్ళు నొప్పులు ఏర్పడుతుంటాయి. వయసు పైబడిన కొందరిలో ఈ బాడీ పెయిన్స్ సాధారణంగానే వస్తుంటాయి. అయితే చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఒళ్ళు నొప్పులు రెట్టింపు అవుతుంటాయి. అయితే వీటి నుంచి బయట పడేందుకు కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. వాటిని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తరసా పడుతుతుంటాయి. అందువల్ల ఒళ్ళు నొప్పులను సహజంగానే తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. .

యాపిల్ ససైడర్ వెనిగర్ బాడీ పెయిన్స్ కు అద్భుతంగా పని చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను వేడి నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అల్లం కూడా బాడీ పెయిన్స్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లన్ని మెత్తగా మిక్సీ పట్టి ఆ పిప్పిని ఒక క్లాత్ లో చుట్టి వేడి నీటిలో బాగా మరిగించి పెయిన్ ఉన్న చోట దానితో మర్ధన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ పాలలో కొద్దిగా కలుపుకొని బాగా వేడి చేసి ఆ మిశ్రమాన్ని తాగితే బాడీ పెయిన్స్ నుంచి విముక్తి లభిస్తుంది. ఇవే కాకుండా అవాల నూనె కూడా ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో సహాయ పడుతుంది. ఆవాల నూనెతో బాడీ పెయిన్స్ ఉన్న చోట మర్ధన చేస్తే ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం.. ముహూర్తం ఖరారు!

- Advertisement -