Year Ender 2024: ఎన్నికల్లో గెలిచిన..ఓడిన నేతలు వీరే! 

4
- Advertisement -
2024 ఖచ్చితంగా ప్రపంచ దేశాలు గుర్తుంచుకునే సంవత్సరం. ఎందుకంటే   ప్రపంచవ్యాప్తంగా కనీసం 64 దేశాలు , ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు తమ ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. ముఖ్యంగా నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు హిస్టరీనే అని చెప్పాలి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడి ఎన్నికయ్యారు.
జూలై 2024లో జరిగిన యుకే సాధారణ ఎన్నికలలో, ప్రధాన మంత్రి రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌లు ఘోర పరాజయాన్ని చవిచూశారు. 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌లకు ఘోర ఓటమి చవికాగా  కెయిర్ స్టార్‌మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  భారతదేశం ఏడు దశల్లో పోలింగ్ జరుగగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.
2024లో ఫిబ్రవరిలో 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు పాకిస్థాన్ లో ఎన్నికలు జరుగగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతించబడలేదు.    బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో  షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్  నాలుగోసారి   విజయం సాధించింది. అయితే హసీనా ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయింది. ప్రజల నిరసనల నేపథ్యంలో ఆగస్టులో ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
శ్రీలంకలో అధ్యక్ష మరియు పార్లమెంటు ఎన్నికలు జరుగగా  మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిసనాయకే గెలుపొందారు.
- Advertisement -