‘విన్న‌ర్‌’కి మిలియ‌న్ వ్యూస్‌

233
Winner Theatrical Trailer for 1 million views
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం విన్నర్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విన్నర్’. శివరాత్రి కానుకగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందించిన పాటలను ఒక్కొక్కటి విడుదల చేస్తూ మూవీపై మంచి క్రేజ్ తెస్తున్న యూనిట్ తాజాగా ట్రైలర్‌తో కుమ్మేసింది.

పులి ఊరి మీద పడ్డప్పుడు అందరు పరిగెడతారు ..కాని ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు అంటూ మొదలైన ఈ ట్రైలర్ చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంది. పాటలు, ఫైటింగ్ సన్నివేశాలు, గుర్రపు స్వారీలు ఇలా అన్ని అంశాలతో ట్రైలర్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. యాక్షన్, డైలాగ్, కామెడీ.. అన్నింటితో ట్రైలర్ ని నింపేశాడు. అంతేకాదు.. విన్నర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లని కూడా చూపించేశాడు. అదెగెలా అంటే.. ? పవన్ మాదిరిగా తేజు చేతిలో ఎర్రని శాలువ కనిపించింది. ఇక, ‘బుజ్జిగాడు’లో ప్రభాస్ హీరోయిన్ త్రిషని అడినట్టు.. ఏదైనా మాట్లాడండి డైలాగ్ ని పెట్టేశాడు.

మొత్తానికి.. ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఈ చిత్రంలో తేజు సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టింది. తాజాగా ఒక మిలియన్‌ వ్యూస్ సంపాదించి సాయి తన స్టెమినాను చాటాడు.

- Advertisement -