‘విన్నర్’ లాసెంతో తెలుసా…!

227
Winner a loser in Overseas
- Advertisement -

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌ వరుస హిట్ చిత్రాలతో మెగా హీరో సాయిధరమ్ తేజ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. కమర్షియల్‌ కథలతో సినిమాలు చేస్తూ ఇప్పటివరకు సేఫ్ గేమ్ ఆడిన తేజ్‌ తాజాగా విన్నర్‌తో లూజర్‌గా మారాడు. విన్నర్‌ చిత్రానికి ఓపెనింగ్స్‌ వచ్చాయని గంభీరంగా కనిపించినా, సోమవారం నుంచి అసలు ‘సినిమా’ కనిపించడంతో చిత్ర యూనిట్ అవాక్కయిందట.

విన్నర్ సినిమా విడుదలైన తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్ల షేర్ రాబట్టిన ఈ సుప్రీం హీరో హిట్ కొట్టినట్లేనని అంతా భావించారు. విన్నర్‌కు పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం … సినిమా టాక్‌తో గట్టెక్కడం ఖాయమని భావించాడట. అయితే రెండో వారం నుంచే విన్నర్‌ సత్తా ఏంటో సాయితో పాటు నిర్మాతలకు తెలిసొచ్చిందట.

తొలి మూడు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ‘విన్నర్’… ఆదివారం తర్వాత నాలుగు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల షేర్ మాత్రము రాబట్టి పూర్తిగా వీకై పోయింది. దీంతో రోజురోజుకి విన్నర్ కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి తోడు శుక్రవారం మూడు సినిమాలు విడుదల కావటం మంచి టాకే తెచ్చుకోవడంతో విన్నర్‌పై మరింత ప్రభవాన్ని చూపాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ. 15 కోట్లకు అటు ఇటుగా వసూళ్లను రాబట్టింది. విన్నర్ చిత్రంపై రూ. 25 కోట్ల బిజినెస్ జరగగా దాదాపుగా రూ.28 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది. అయితే  ప్రస్తుతం విన్నర్‌ పూర్తిగా లూజర్‌గా మిగిలిపోవాల్సిన పరిస్ధితి ఉంది.

దీంతో తక్కువలో తక్కువైనా దాదాపు రూ.10 కోట్లయినా నష్టం తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుప్రీం హీరో కెరీర్‌లో విన్నర్ పెద్ద డిజాస్టర్‌గా మారే అవకాశం ఉంది.

- Advertisement -