- Advertisement -
మందుబాబులకు షాక్. హోలీ సందర్భంగా వైన్స్ షాపులు గ్రేటప్ పరిధిలో బంద్ కానున్నాయి. హైదరాబాద్లో ఈ నెల 6వ తేదీసాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. హోలీ పండుగని దృష్టిలో పెట్టుకుని వైన్స్షాపులను క్లోజ్ చేయించనున్నట్లు వెల్లడించారు.
హోలీ సందర్భంగా ప్రతి ఏడాదీ నగరంలో మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. మద్యం షాపులను మూసివేయాల్సిందిగా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా షాపులు మూసివేయాలని వైన్స్నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -