మున్రో విధ్వంసం..టీ20ల్లో అరుదైన రికార్డ్

220
Windies stutter after Colin Munro’s 104
- Advertisement -

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ విధ్వంసక బ్యాట్స్‌ మెన్ కొలిన్ మున్రో మరోసారి రెచ్చిపోయాడు. బే  ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఆకాశమే హద్దుగా సిక్సర్లు, ఫోర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మున్రో..టీ20ల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌ మెన్‌గా రికార్డు సృష్టించాడు.

కేవలం 47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసిన మున్రో..విండీస్ బౌలర్లకు పీడకలను మిగిల్చాడు. మున్రోకు తోడు మార్టిన్ గప్టిల్ (33 బంతుల్లో 63) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

Windies stutter after Colin Munro’s 104

గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ కొట్టాడు. నవంబర్‌ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

- Advertisement -