వెండితెరపై నల్లకలువల బయోపిక్

224
williams sisters biopic
- Advertisement -

విలియమ్స్‌ సిస్టర్స్‌..టెన్నిస్ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేర్లు. ప్రపంచ టెన్నిస్‌లో తమ ఆటతో చెరగని ముద్రవేసిన అక్కాచెల్లెల్లు సెరీనా విలియమ్స్‌, వీనస్‌ విలియమ్స్ బయోపిక్‌ రాబోతుంది. స్టార్‌ త్రోవర్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై టిమ్‌, ట్రీవర్‌లు నిర్మించనున్నారు. విలియమ్స్ సిస్టర్స్‌ తండ్రిపాత్రలో హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్‌ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా మారింది.

సెరీనా, వీనస్‌లకు నాలుగేల్ల వయస్సున్నప్పటి నుంచి వారిని అత్యుత్తమ టెన్నిస్‌ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రిచర్డ్ పడ్డ కష్టాన్ని చూపించనున్నారట. టిన్నిస్‌కు సంబంధించిన మెళకువలను ఒక్కో పాఠంగా చెబుతూ ఆ సోదరీమణులను ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిలుగా ఎలా తీర్చిదిద్దారు..తర్వాత టెన్నిస్‌ను వారు శాసించిన తీరు,పథకాల వేటలో ఇద్దరు పరస్పరం తలపడటం వంటి అంశాలను చూపించనున్నారట.

1999 యూఎస్‌ ఓపెన్‌లో అదరగొట్టిన సెరీనా ఇప్పటివరకూ 23 గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. వీనస్‌తో కలిసి ఆడి 14 గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ ఛాంపియన్‌ షిప్‌లను సొంతం చేసుకుంది. వీనస్ తన కెరీర్‌లో 7 గ్రాండ్ స్లామ్‌ టైటిల్స్‌ గెలవడంతో 4 సార్లు ఒలంపిక్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్‌ సాధించింది. ఇప్పటికే భాతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల టెండ్ర్‌ నడుస్తున్న నేపథ్యంలో హాలీవుడ్‌లో తెరకెక్కనున్న విలియమ్స్‌ సిస్టర్స్‌ బయోపిక్‌ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

- Advertisement -