కాంగ్రెస్ లో ఇప్పటికైనా.. వర్గపోరు తగ్గేనా !

26
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అనగానే ఆధిపత్య విభేదాలకు, వర్గ పోరుకు పుట్టినిల్లుగా చెబుతుంటారు చాలా మంది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. మొదటి నుంచి ఇప్పటివరకు పార్టీ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ పార్టీలో విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే అర్థమౌతుంది. ఇక టి కాంగ్రెస్ లో అయితే ఈ రకమైన ఆదిపత్య పోరు మరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సొంత పార్టీలోనే ఒకరంటే ఒకరు పడని నేతలు, ఆదిపత్యం కోసం పార్టీని దెబ్బతీసే వ్యూహాలు.. అబ్బో ఇలా ఒక్కటేంటి టి కాంగ్రెస్ లో నిన్న మొన్నటి వరకు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు పార్టీలోని సీనియర్స్ మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనెంతలా వివాదాలు కొనసాగాయి.

దీంతో పార్టీ ప్రభావం కూడా రాష్ట్రం నివురుగప్పుతూ వచ్చింది. అయితే వచ్చే ఎన్నికలతో కాంగ్రెస్ పనైపోతుంది అనే భావన అందరిలోనూ కలుగుతున్న నేపథ్యంలో కర్నాటక ఎన్నికల్లో అనూహ్య విజయం ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపింది. సొంత రాష్ట్రంలో గెలిచినంతా ఆనందంగా టి కాంగ్రెస్ నేతలు కర్నాటక విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇదే జోష్ ను కొనసాగిస్తూ తెలంగాణలో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే నేతలందరు తామంతా ఒక్కటే అనే మాట పైపైకి వినిపిస్తున్నప్పటికి లోలోపల ఆధిపత్య విభేదాలు నివురుగప్పిన నిప్పుల ఉన్నాయనే చెప్పాలి. టి కాంగ్రెస్ లో అరకొర సీనియర్స్ తప్పా సీనియర్ నేతలెవరూ రేవంత్ రెడ్డితో కలిసి ముందడుగు వేయడం లేదు.

Also Read: మోదీ ది బాస్ : ఆంథోనీ అల్బనీస్‌

జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంటివారు ఇంకా రేవంత్ రెడ్డి తో దూరం పాటిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇదిలాఉంచితే ఈ నెల 26న టి కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ కానుంది. ఈ భేటీలో ఎన్నికల కార్యచరణపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ కోసం కలిసి పని చేయాలని అధిష్టానం ఎప్పటికప్పుడు సూచిస్తున్నప్పటికి.. నేతలు మాత్రం విని విననట్టుగానే వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఈ వర్గపోరు ఇలాగే కొనసాగితే.. కర్నాటక విజయాన్ని కొనసాగిస్తారో లేదో తెలియదు గాని తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి టి కాంగ్రెస్ లోని లొసుగులను రూపుమాపేందుకు హైకమాండ్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.

Also Read: వామ్మో ఎలక్షన్స్.. బీజేపీ భయం !

- Advertisement -