ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నానని తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయాలతో ఈ యాత్రకు సంబంధం లేదని తెలిపాడు. ప్రస్తుతం డెహ్రాడున్‌లో ఉన్న రజనీ.. అమితాబ్ ఆరోగ్యం గురించి ఇప్పుడే తెలిసిందని ఆయన త్వరగా కొలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
నాలుగు రోజుల క్రితం చెన్నై నుండి సిమ్లాకి వెళ్ళిన రజనీ..తొలుత ధర్మశాల, రిషికేష్‌తో పాటు పలు పుణ్యక్షేత్రాలని సందర్శించారు. హిమాలయాలలో ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. రజనీ హిమాలయాల పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికలలో 234 స్థానాలలో పోటీ చేసేందుకు రజనీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ 2.0, కాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.