బాహు బాలీవుడ్‌ ఎంట్రీ…

185
Will Prabhas Star In A Hindi Film Next
- Advertisement -

‘బాహుబలి 2’ భారీ విజయంతో ప్రభాస్ ఆనందంతో పొంగిపోతున్నాడు .. ఇప్పుడు ఎక్కడ చూసినా .. ఎవరి నోట విన్నా ప్రభాస్‌ పేరు వినిపిస్తోంది. ‘బాహుబలి 2’ దెబ్బకి భాషా .. ప్రాంతం అనే తేడా లేకుండా చాలామంది ప్రభాస్ అభిమానులుగా మారిపోతున్నారు. దాంతో పెద్ద నిర్మాణ సంస్థల చూపు ప్రభాస్ పైనే పడింది. ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఎంత కాలమైనా ఫరవాలేదు .. వెయిట్ చేస్తామని చెబుతున్నారట.అయితే ఇప్పుడు సహజంగానే ప్రభాస్ పారితోషికం పెరిగిపోయింది. 25 కోట్ల వరకూ వుండే ఆయన పారితోషికం ఇప్పుడు 30 కోట్లకి చేరిందని అంటున్నారు.

Will Prabhas Star In A Hindi Film Next

అయితే ప్రభాస్‌ మాత్రం డబ్బు గురించి మాత్రమే ఆలోచించకుండా ప్రాజెక్టు మంచిదైతేనే ఓకే చెప్పాలనే బలమైన నిర్ణయంతో ప్రభాస్ వున్నాడట. ‘బాహుబలి 2’తో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిస్తున్నాడని చెబుతున్నారు. తాజాగా ప్రభాస్‌ బాలీవుడ్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రభాస్‌ సుజీత్ దర్శకత్వంలో ఒకటి .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒకటి చేయనున్నాడు.ఈ సినిమాల తరువాత ఇక హిందీలోను రెండు సినిమాలు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడనేది తాజా సమాచారం.

అంతే కాదట ప్రభాస్ తో రెండు సినిమాలు చేయడానికి కరణ్ జొహార్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడట. ఈ డీల్ గురించి ఆయన ప్రభాస్ తో మాట్లాడటం కూడా పూర్తయిందని అంటున్నారు. వచ్చేనెలలో ప్రభాస్ ముంబై వెళ్లి ఈ డీల్ ను ఫైనలైజ్ చేసుకుని వస్తాడట. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ .. త్వరలో తాను హిందీ సినిమా చేసే అవకాశం ఉందని చెప్పడంలోని ఆంతర్యం ఇదేనన్న మాట మరి ప్రభాస్‌ బాలీవుడ్‌ లోను తన సత్త చూపించబోతున్నాడన్నమాట.

- Advertisement -