- Advertisement -
టీఆర్ఎస్‌లో మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింలు చేరికకు ముహూర్తం ఖరారు. సోమవారం (ఈ నెల 18న) మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.మోత్కుపల్లి గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. టీడీపీ తరఫున అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నుంచి బయటికి వచ్చిన మోత్కుపల్లి తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
- Advertisement -