సౌత్రాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. డివిలియర్స్ ఆటను మళ్లి చూడలేం అనుకున్న అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. ఐపిఎల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు డివిలియర్స్ గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. డివిలియర్స్ ఆటకు సౌతాఫ్రికా లోనే కాకుండా ఇండియాలో చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈసందర్భంగా ఇండియాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు డివిలియర్స్.
ఐపిఎల్ లో డివిలియర్స్ బెంగుళూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపిఎల్ మ్యాచ్ ముగిసిన అనంతరం విదేశాల్లో నిర్వహించే లీగ్ లలో ఆడాలనే ఆలోచన లేదని, దేశవాళీ క్రికెట్లో టైటాన్స్ జట్టుకు అందుబాటులో ఉంటానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు డివిలియర్స్. మరికొన్ని రోజులు తాను ఐపిఎల్ లో ఆడనున్నట్లు తెలిపారు. దింతో క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు.
యువ ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నానని, కానీ ఇంతవరకూ ఎలాంటి ప్లాన్ వేసుకొలేదన్నారు. బెంగుళూరు జట్టు నాకు ఎంతో ఇష్టం అని..బెంగళూరు నాకు మరో జన్మస్ధలం లాంటిదన్నారు. బెంగుళూరులో నాకెరీర్ లో వందవ టెస్టు ఆడానని..నాకు జీవిత కాలం గుర్తిండిపొతుందన్నారు. భారత్ నన్ను సొంత ఆటగాడిలా భావించిందన్నారు. ప్రపంచం నలుమూల నుంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకొలేదన్నారు.