మహేష్‌ రికార్డును బ్రేక్‌ చేయనున్న ఎన్టీఆర్..

255
Will Jr NTR Beat Mahesh Babu's Record
- Advertisement -

ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ మూవీ దసరా పండుగకి వారంరోజుల ముందుగానే విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవ కుశ’ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది. అమెరికాలో ఇంతవరకూ 10.6 కోట్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా, 150 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Will Jr NTR Beat Mahesh Babu's Record

అయితే అధికారికంగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించవలసి వుంది. టాలీవుడ్ లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలలో, 164 కోట్లను సాధించి ‘ఖైదీ నెంబర్ 150’ మొదటిస్థానంలో ఉండగా, 156 కోట్లను రాబట్టి ‘శ్రీమంతుడు’ రెండవ స్థానంలో వుంది. ‘శ్రీమంతుడు’ వసూళ్లకు చేరువైన ‘జై లవ కుశ’ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉందంటున్నారు సిని విశ్లేషకులు.

- Advertisement -