ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు గవర్నర్ తమిళి సై. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ను అందిసత్ఉందన్నారు. ప్రత్యేకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేస్తాం అన్నారు.
తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని చెప్పుకొచ్చారు. త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని… రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా తమ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం కింద 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త MSME విధానాన్ని కూడా అమలులోకి తీసుకొస్తామన్నారు.
Also Read:‘మంకీ ఫీవర్ ‘ యమ డేంజర్.. జాగ్రత్త!