నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన కవిత..బిడ్డా అరవింద్ చెప్పుతో కొడతా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ మద్దతుతో యాక్సిడెంటల్‌గా ఎంపీ అయ్యారని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడే భాష తో
నిజామాబాద్ పరువు పోతోందన్నారు.
పార్లమెంట్ లో ఎంపీ లు అవరేజ్ గా 20 డిబేట్ లలో పాల్గొంటే అరవింద్ 5 చర్చల్లో పాల్గొన్నారని…పార్లమెంట్ లో ఏ ఒక్క అంశం పై గొంతెత్తి మాట్లాడలేదన్నారు.పసుపు బోర్డ్ తెస్తామని బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. రేపటి నుంచి పోలీస్ స్టేషన్ లలో రైతులు చీటింగ్ కేసు లు పట్టబోతున్నారని…ఆయన క్వాలిఫికేషన్ పైన నేనే పార్లమెంట్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
అరవింద్ బురద లాంటోడు.. ఆయన మీద రాయి వేస్తే మన మీదనే పడదని ఎద్దేవా చేశారు కవిత. తాను కాంగ్రెస్ తో టచ్ లో వున్న అని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట.. అరవింద్ ఎందుకు కాంగ్రెస్ కు టచ్ లో వున్నారని ప్రశ్నించారు. నిజమా బాద్ ప్రజల ఖర్మ ..అరవింద్ ఎంపీగా గెలవటం అన్నారు. రాజకీయాల్లో వుంటే నీతి, నిజాయితీ ఉండాలి…ఇంకోసారి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పుతో కొడతా అని మండిపడ్డారు.
నువ్వు ఎక్కడికి పోయినా వెంట పడి కొడతాం..తమాషా అనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి మాట్లాడితే మెత్తగా తంతం…నేను ఇంత మాట అన్నా అంటే అరవింద్ ఎంత చీప్ అనేది ఆలోచించాలన్నారు. మల్లికార్జున్ ఖర్గే తో అందరికీ ఫ్రెండ్ షిప్ వుంటది.. అందరు మాట్లాడుతరు అన్నారు.
ఇవి కూడా చదవండి..