సాఫ్ట్ వేర్ భర్త వేధింపులు..భార్య ఆత్మహత్య

366
shivani
- Advertisement -

సాప్ట్ వేర్ ఉద్యోగి వేధింపులు తట్టుకోలేక అతని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త మరొక హహిళతో అక్రమ సంబంధం కొనసాగిసాగిస్తున్నాడని తెలిసిన ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది వివరాల్లోకి వెళ్తే.. సుకీత్, శివానీలు ఐదేళ్లక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావడంతో జీవితం సాఫీగా సాగింది. కాగా, ఇటీవల 4-5 నెలల నుంచి సుకీత్ ప్రవర్తనను గమనించి అతడిని అనుసరించింది. తీరా చూస్తే తన భర్త మరో అమ్మాయితో కలిసి గుట్టుగా కాపురం పెట్టినట్లు తెలిసింది. దీంతో పలుమార్లు భర్తను మందలించింది శివానీ. ఆ అమ్మాయి గురించి అడగడంతో రోజు భార్యను వేధిస్తున్నాడు సుకీత్.

సుకీత్ కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ ఈ మధ్యనే కుటుంబ సభ్యులతో మాట్లాడిన శివాని చాలా నీరసంగా ఉంది. తన భర్త తనను చనిపోవాలనీ, తను వేరే పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపింది. నిన్న రాత్రి 1 నవంబర్ అంబర్ పేట్ లో తమ నివాసంలో ఆమె ఉరివేసుకొని మరణించింది.

విషయాన్ని గమనించిన సుకీత్ కుటుంబ సభ్యులు.. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ, శివాని మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకోవడానికి సరిపోయేలా ఇంటి పైకప్పు లేదనీ, కప్పు చాలా తక్కువ ఎత్తులో ఉందని వారు ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.శివాని మృతి పై అనుమానమున్న ఆమె తల్లిదండ్రులు అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ లో సుకీత్, మరియు అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.

- Advertisement -