పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఓ వ్యాపారి భార్య తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రియుడితో కలిసి గోవాకి వెళ్లింది. అయితే ముందు నుంచే భార్యపై అనుమానం ఉన్న ఆ వ్యాపారి ఆమె కారులో జీపీఎస్ అమర్చాడు. ఫోన్ ద్వారా తన భార్య గోవాలో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నివసిస్తుంది ఓ వ్యాపారి కుటుంబం. వ్యాపారం నిమిత్తం భర్త తరచూ బయటి ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఆ సమయంలో ఆయన భార్య వ్యాపార పనులు చూసుకునేది. ఈ నేపథ్యంలో ఓ కారు వాషింగ్ షాప్ యజమాని మాధవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. ఓ రోజు అమీర్ పేటలో ఈ ఇద్దరు కలిసి ఉండడంతో భర్త వారిని నిలదీశాడు. మళ్లి ఇలాంటి తప్పు జరగిందని క్షమించాలని కోరుకుంది భార్య.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లివస్తానని భర్తకు చెప్పి వెళ్లింది. ఆమెపై ముందు నుంచే అనుమానం ఉన్న భర్త, ఆమె కారులో జీపీఎస్ అమర్చాడు. తన ఫోన్ ద్వారా భార్య ఎక్కడుందో అని చూడగా గోవాలో ఉన్నట్లు చూపించింది. ఆరా తీయగా ప్రియుడితో కలిసి గోవాకి వెళ్లినట్లు తెలిసింది. ఆ ఇద్దరిపై వ్యాపారి ఎస్ఆర్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన భార్య తనకు నమ్మకం ద్రోహం చేసిందని, అలాగే ఆమె ప్రియుడిని కూడా అరెస్టు చేయాలని ఫిర్యాదు పేర్కొన్నాడు.