తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. అక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనించడం అందరిని అశ్చర్యనికి గురి చేసింది . తలసాని కన్వాయ్‌తో చంద్రబాబు ఇంటి వద్ద చేరుకోవడంతో విషయం తెలిసిన మీడియా అక్కడకు చేరుకున్నారు. మీడియాను చూసిన మంత్ర తలసాని వెంటనే అక్కడి నుండి వెనుదిరిగారు.
అయితే ఈ విషయంపై ప్రశ్నించగా.. ఈరోజు రోడ్ నంబరు 36లో ఒ వేడుక ఉండడంతో అటు వెళ్తుతుండగా వర్షం రావడంతో పోరపాటున వచ్చానని చెప్పారు. అసలు చంద్రబాబు ఇక్కడ ఉన్నాడని తెలియదని మంత్రి తలసాని మీడియా వారికి వివరణ ఇచ్చారు.చంద్రబాబు హైద్రాబాద్‌లో ఉన్న విషయం తనకు తెలియక వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే అక్కడున్న సిబ్బంది మాత్రం మంత్రి తలసాని అప్పుడప్పుడు వస్తుంటారని బాబును కలుస్తారని అంటున్నారు.
అయితే మంత్రి తలసాని పొరపాటుగా అటువైపు వచ్చారా.. లేదంటే చంద్రబాబును కలవాలనే ఉద్దేశంతోనే అటు వైపు వచ్చారా అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. తలసాని 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరుపున గెలిచారు. ఈ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.