ఇండియన్ రికార్డులు తిరగరాసిన తొలి తెలుగు సినిమాగా బాహుబలి. బాహుబలితో రికార్డు సృష్టించిన జక్కన్న దాని సీక్వెల్‌గా కన్ క్లూజన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు దేశాల్లో ప్రీమియర్ షోలతో బాహుబలి 2 సందడి చేస్తోంది. ఇప్పటివరకు అందరు ఎగ్జైట్ మెంట్‌గా ఎదురుచూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. కట్టప్ప .. బాహుబలిని చంపడానికి ఇదే కారణం అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి.
అయితే, సినిమా చూసిన వారు చెప్పిన దాని ప్రకారం బాహుబలిని బతికించడానికే కట్టప్ప ఆయన్ని చంపాడట. మహిష్మతి రాజుగా పీఠం అలంకరించే రాజుకు శాపం ఉండటం… ఆ శాపం కారణంతో శిలగా మారే ప్రమాదం వస్తుందట. సో దీని నుంచి బాహుబలిని తప్పించేందుకు కట్టప్ప తన కత్తికి పనిచెబుతాడట.
ఇక బాహుబలి 2 హాలీవుడ్ సినిమాను తలపించే విధంగా ఉందట. ఎక్కడ తగ్గకుండా జక్కన్న ప్రేక్షకులు థ్రిల్ అయ్యేవిధంగా సినిమాను తెరకెక్కించారట. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో సినిమా చూస్తున్నంత సేపు సమయమే తెలియదని చెబుతున్నారు. పోరాట సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారని ముఖ్యంగా రానా, ప్రభాస్ పోటీ పడి నటించారని ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార సినిమా చూసి వారి మాట. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారని చెబుతున్నారు.
దేశంలో ఇప్పటివరకు ఏ సినిమా విడుదల కాని విధంగా 9 వేల స్కీన్లపై బాహుబలి విడుదల కానుండటంతో సినిమా వసూళ్లపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినిమాకు ప్రివ్యూ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రూ. 1000 కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి నిలుస్తుందనటంలో సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.