సమంతపై నెటిజన్ల ఫైర్…

360
samantha
- Advertisement -

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో అందాలతార సమంత ఒక‌రు‌. సామ్ న‌టించిన సినిమాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హీట్ల‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా సమంత నటించిన యూ టర్న్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుతం హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్‌..సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలతో విమర్శల పాలవుతోంది.

చై తో కలిసి స్పెయిన్‌లో ఉన్న సామ్ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. అయితే రెడ్‌ కలర్ పొట్టి డ్రెస్సులో హాట్ హాట్‌గా ఉన్న సామ్ ఫోటోలపై పాజిటివ్‌ కంటే నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది.

సోషల్ మీడియా వేదికగా నెటిజన్లే కాదు అక్కినేని ఫ్యాన్స్‌ సైతం నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో చాలా దరిద్రంగా ఉందని.. ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో తీసేయ్ అంటూ కొందరు మండి పడుతున్నారు. నీకు పెళ్లయింది… నీపై గౌరవం ఉంది… దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు అంటూ కొందరు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

- Advertisement -