క్రికెటర్ గౌతమ్ గంభీర్ కశ్మీర్ వేర్పాటువాది మిర్వేజ్ ఫరూక్‌పై సీరియస్ అయ్యాడు . పాకిస్థాన్ గెలిస్తే.. వెళ్లి ఆ దేశంలోనే సెలబ్రేట్ చేసుకో అంటూ ఫరూక్ ట్వీట్‌కు గంభీర్ రీట్వీట్ చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాశ్మీర్ వేర్పాటువాది మిర్వేజ్ ఫరూక్ పాకిస్థాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
పాక్ గెలవగానే ఎటు చూసినా పటాకుల మోతతో ఈద్ ముందే వచ్చినట్లుంది.. పాక్ టీమ్‌కు శుభాకాంక్షలు అంటూ ఫరూక్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ని సహించలేకపోయిన గంభీర్.. కాస్త వెటకారంగా రీట్వీట్ తో ఫరూక్ కి కౌంటర్ ఇచ్చాడు.
‘ఫరూక్.. నీకో సలహా. మీరు సరిహద్దు క్రాస్ చేస్తే ఇంకా మంచి పటాకులు (చైనీస్) దొరుకుతాయి. అక్కడే ఈద్ సెలబ్రేట్ చేసుకో. ప్యాకింగ్‌లో మీకు నేను సాయం చేస్తా’ అని గంభీర్ ట్వీట్ చేశాడు.
అయితే మిర్వేజ్ ఫరూక్ పాకిస్థాన్ జట్టుకు మద్దతుగా ట్వీట్ చేయడం ఇదే తొలిసారి కాదు. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుని ఓడించిన తర్వాత కూడా ఫరూక్ పాకిస్థాన్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో గంభీర్ ఫరూక్ ట్వీట్లపై తనదైన శైలిలో స్పందించాడు.