దేశమంతా బాహుబలి 2 ఫివర్‌తో ఊగిపోతోంది. ప్రపంచ రికార్డులు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచింది. బాహుబలి 1లో గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజమౌళి కట్టప్పతో ‘బాహుబలి’ని చంపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?’ అని ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కన్‌క్లూజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సస్పెన్స్ వీడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగక తప్పదు.
ప్రస్తుతం దేశంలోని సినీ అభిమానులంతా ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది. ఈ లోపు ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతున్నారు.
అయితే ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం తాజాగా లీకైందట. బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణం శివగామి అట. బాహుబలికి వ్యతిరేకంగా శివగామికి భల్లాల దేవ, అతని తండ్రి బిజ్జల దేవుడు అసత్యాలు చెబుతారట. దాంతో వాటిని నమ్మిన శివగామి బాహుబలిని చంపమని కట్టప్పను ఆదేశిస్తుందట. ఇదే బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణమని తెలుస్తోంది.
కాగా, ‘బాహుబలి-2’ కథ పరంగా, డ్రామా పరంగా ‘బాహుబలి-1’ కంటే చాలా మెరుగ్గా ఉంటుందట. అలాగే కొన్ని సన్నివేశాలు, వార్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండో భాగంలో బాహుబలి విగ్రహాన్ని పైకి లేపే సీన్ అత్యద్భుతంగా వచ్చినట్టు వినికిడి. ఇక ఈ విషయం బయటపడగానే ఫ్యాన్సంతా మరింత ఆసక్తిగా కంక్లూజన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.