నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నరు. ప్రజలకు సంబంధించిన అంశాల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు అనుకున్నం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్… దసరాకు మొండి చేయి చూపారు, దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపి వార్త చెబుతరేమో అనుకున్నం..కానీ తీవ్ర నిరాశే మిగిలింది అన్నారు. రైతులకు బోనస్ పేరిట ఇచ్చే 1300 కోట్ల బకాయిలైనా ఇస్తరేమో అనుకున్నం. మహిళలకు 2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తరేమో అనుకున్నం. పింఛన్లు అయినా పెంచుతరేమో అని అనుకున్నం..కానీ జరిగింది ఏం లేదు, అందరికీ నిరాశే మిగిలింది.
ఏది లేదు, క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి, మంత్రుల పంచాయతీ పెట్టుకున్నరు అన్నారు.
క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఒకటి కాదు, రెండు కాదు అరడజను వర్గాలుగా చీలిపోయారు. ఒకరంటే ఒకరికి పడుతలేదు… సీఎం, మంత్రులు.. పాలన గాలికి వదిలి పర్సనల్ పంచాయతీలు పెట్టుకుంటున్నరు…కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, కబ్జాల కోసం, పోస్టింగుల కోసం ఇది మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు.. దండుపాళ్యం ముఠా లెక్క ఉంది అన్నారు. ఇంకా చెప్పాలంటే అంతకంటే అధ్వాన్నం. ప్రతి దాంట్లో కొట్లాటలే.ఆ మంత్రి ఈ మంత్రిని తిట్టుడు, ఈ మంత్రి ఆ మంత్రి తిట్టుడు ఇదే సరిపోయింది…అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతదో అని స్వయంగా మంత్రులే భయపడుతున్నరు అన్నారు.
దీపం ఉండంగనే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో అధికారంలో ఉన్నపుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నరు…కేసీఆర్ గారు ఉద్యోగాల్లో 95శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారు.నీళ్లలో వాటా కోసం కొట్లాడారు. నిధుల వాటా కోసం కొట్లాడారు. నేడు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, అక్రమ వసూళ్లలో వాటా కోసం మంత్రులు కొట్లాడుతున్నరు.కాంట్రాక్టుల కోసం డిపార్టుమెంట్లే రద్దు చేస్తున్నారు.పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నరు.కాంగ్రెస్ తప్పిదాల వల్ల టీఎస్ఐపాస్ వచ్చిన తర్వాత గత గత ఎనిమిది ఏండ్లలో అతి తక్కువ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్లు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది.2024-25లో కేవలం 2049 పరిశ్రమలు, 50వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.ఎవర్ లోయేస్ట్ ఇన్వెస్ట్మెంట్ టీఎస్ఐపాస్ ఏర్పడ్డ తర్వాత.
ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ ఘన కార్యం అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ఐపాస్ తెచ్చి అనుమతులు సులభతరం చేసాం.,..పెట్టుబడులకు స్వర్గధామంగా రాష్ట్రాన్ని మార్చాం…పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసాం..కానీ ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నరు..రేవంత్ రెడ్డి గన్ కల్చర్ తెచ్చిండు,అక్రమ వసూల్లకు పాల్పడుతున్నారు.టెక్ మహీంద్ర సీఈఓకు నాడు కేటీఆర్ గారు వర్షంలో గొడుగు పట్టి ఆహ్వానించారు.పెట్టుబడులు రావాలని కృష్టి చేసింది బిఆర్ఎస్. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు తగ్గిపోయాయి.ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెబుతున్నారు.. ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ పట్టి బెదిరించారు అని.ముఖ్యమంత్రి జపాన్ నుంచి ఫైల్ ఆపించారు, ఇంకో మంత్రి టెండర్లు మాకు దక్కవద్దని హుకుం జారి చేసారు అని.రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నది.ఇంత జరుగుతుంటే బిజేపీ ఎందుకు మౌనంగా ఉంది.ముఖ్యమంత్రే తుపాకీ పంపారు అంటే ఎందుకు విచారణ జరపరు.బిజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాకుంటే, మీది బడే భాయ్ చోటే బాయ్ సంబంధం లేదు అంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంజయ్ గారు స్పందించండి.కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపండి అన్నారు.
లేదా ఇండిపెండెంట్ జుడిషియల్ కమిషన్ పెట్టి నిజానిజాలు బయటకు తీయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.లేదంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లే..ఈ పాటి దానికి డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు చేస్తరట…ఎందుకు తుపాకీలు పెట్టి వసూళ్లు చేసామని, మంత్రులు మంత్రులు కొట్టుకుంటున్నందుకా? దేని కోసం విజయోత్సవాలు?,23 నెలల పాలనలో ఏం చేసారు, ఏం సాధించారు?,ఒక్క ఇళ్లు కట్టింది లేదు, ఒక్క ఇటుక పేర్చింది లేదు.,ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చింది లేదు.,టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేసింది లేదు.
ఉన్న పథకాలను ఊడగొట్టారు.
ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వలేదని జరపుతారా?
కేసీఆర్ కిట్ బంద్ చేసారని జరుపుతారా
గొర్రెల స్కీం బంద్ పెట్టినమని జరుపుతారా?
కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఆగం చేసారు.
ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు, 420 హామీల అమలు ఊసు లేదు.
అయినా విజయోత్సవాలు చేస్తమని చెప్పుకోవడానికి సిగ్గు లేదు.
అసలు ఏం చేసావని విజయోత్సవాలు…
రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా?
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా?
రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా?
రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా?
అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా?
1300 కోట్ల బోనస్ డబ్బులు ఇప్పటికీ రైతులకు చెల్లించినందుకా?
దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా?
లగచర్ల, రాజోలి రైతుల చేతుల చేతులకు బీడీలు వేసినందుకా?
మొదటి ఏడాడిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని యువతను మోసం చేసినందుకా?
నిరుద్యోగ భృతి ఎగ్గొడుతున్నందుకా?
మహాలక్ష్మి పేరిట నెలకు 2500 ఇస్తానని, ఇప్పటికీ అమలు చేయనందుకా?
ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకా?
అవ్వాతాతలకు పించన్లు పెంచనందుకా?
హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకా?
మూసీ సుందరీకరణ పేరుతో కమీషన్లు దండుకుంటున్నందుకా?
ఎందుకు విజయోత్సవాలు చేస్తా అంటున్నవు రేవంత్ రెడ్డి?..ఇంకెంత కాలం మోసం చేస్తారు, ఇంకెంత కాలం మభ్యపెడుతరు..22 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెట్టినవు…. ఎందుకోసం ఉత్సవాలు జరుపుతావు చెప్పాలని ప్రశ్నించారు.
Also Read:ట్రెండింగ్‌లో మీసాల పిల్ల సాంగ్!

