ఎన్టీఆర్ బయోపిక్…ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరమీద ఆవిష్కరించేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఈ సినిమాతో బాలయ్య తానే నిర్మాతగా కూడా మారి భారీ హైప్ క్రియేట్ చేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఏ చిన్న వార్తైన టాలీవుడ్‌లో హాట్ న్యూస్‌గా మారింది. కానీ ఎట్టకేలకు అన్నిఅవాంతరాలను ఎదుర్కొని ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా తేజ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. రామకృష్ణ స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే అనుకోకుండా ఓ వార్త బాలయ్యను నిద్రలేకుండా చేసింది. ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు దర్శకుడు తేజ.
ఇక ఇంత అర్థంతరంగా తేజ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వదిలేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తాను ఏ సినిమా చేసిన పూర్తి స్వేచ్ఛగా చేసే తేజ..ఎన్టీఆర్ బయోపిక్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం తట్టుకోలేక పోయాడట. పలు సీన్లలో బాలయ్య జోక్యంతో విసిగి సినిమా నుంచి తప్పుకోవడమే బెటర్ అనే భావనకు వచ్చి పక్కకు తప్పుకున్నాడట. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు కష్టాల్లో పడినట్లైంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను ఇప్పుడెవరు తీసుకుంటారు? అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తేజ స్ధానంలో దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమాను తెరకెక్కిస్తారని ప్రచారం జరిగిన ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. దీంతో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కించిన క్రిష్ లేదా కృష్ణవంశీతో సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నాడని సన్నిహిత వర్గాల సమాచారం.
ఒకవేళ వీరంతా కాదంటే తానే దర్శకుడిగా మారి ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించాలని భావిస్తున్నారని…ఎందుకంటే గతంలో బాలయ్య నర్తనశాల సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్నారు. కానీ సౌందర్య మరణంతో ఆ ప్రాజెక్టును తెరకెక్కించే ఆలోచనను విరమించుకున్నాడు. కానీ తాజాగా తన తండ్రి బయోపిక్‌తో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తున్నా….అనుభవం ఉన్న దర్శకుడు తెరకెక్కిస్తే తప్ప సినిమా అన్నివర్గాలను ఆకట్టుకునే పరిస్ధితి ఉండదు.