మరింత వేగంగా ఒమిక్రాన్ సబ్-వేరియంట్…!

68
who
- Advertisement -

ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఏ.2 57 దేశాలకు పాకిందని జీఐఎస్ఏఐడీ నివేదిక ప్రకారం వెల్లడైంది. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ జన్యు విశ్లేషణలో సగం కేసులు ఇవే బయటపడుతున్నట్టు తేలిందని వెల్లడించింది.

సబ్-వేరియంట్స్ మధ్య వ్యత్యాసాల గురించి చాలా స్వల్ప సమాచారం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తితో పాటు లక్షణాలు, రోగనిరోధక శక్తిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది అధ్యయనం చేపట్టాలని తెలిపింది.

సబ్-వేరియంట్ గురించి సమాచారం చాలా పరిమితంగా ఉందని …అయితే BA.1 కంటే BA.2 వృద్ధి రేటులో స్వల్ప పెరుగుదల ఉందని సూచించింది. డెల్టా వంటి మునుపటి వేరియంట్‌ల కంటే ఓమిక్రాన్ సాధారణంగా తక్కువ తీవ్రత కలిగి ఉందని వెల్లడించింది.

- Advertisement -