ఎమ్మెల్యేల కొనుగోలు..ఎవరీ సంతోష్‌..?

317
bl
- Advertisement -

దేశవ్యాప్తంగా ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదొయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ…అందులో భాగంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగొలు కోసం రూ. 100 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఇక ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బీజేపీ నేతలు మరింత చిక్కుల్లో పడ్డారు.

ఇక ఆడియో టేపుల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు బీఎల్ సంతోష్. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సంతోష్‌…ఈ డీల్‌ అంతటికి సూత్రదారి అని తెలుస్తోంది. ఇక సంతోష్ పూర్తి పేరు బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్‌. బీజేపీలో టాప్‌- నేత. కర్ణాటకలోని ఉడిపికి చెందిన బీఎల్‌ సంతోష్‌.. దావణగెరెలోని బీడీటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఇంస్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ చదివారు.

1993లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2006లో కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ,2014లో బీజేపీ జాతీయ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా, 2019లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ అంతర్గత వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌కు, బీజేపీ మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ మధ్యన సంధానకర్తలా వ్యవహరిస్తుంటారని రాజకీయవర్గాల్లో టాక్‌. తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టే సంతోష్‌.. సోషల్‌ మీడియాలో సైతం చురుగ్గా ఉంటారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే కార్యక్రమాన్ని తన భుజాన వేసుకుని అడ్డంగా బుక్కయ్యారు.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

కృష్ణా బోర్డు దండగ

- Advertisement -