ధోని ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా..?

210
who is MS Dhoni's first crush Do Know?
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనికి విఫరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ధోని సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఆయన అభిమానులు తెగ చొరవచూపిస్తుంటారు. ధోని జీవితం ఆధారంగా తెరికెక్కిన బయోపిక్ లో ఆయన సీక్రెట్స్ పూర్తి స్థాయిలో చూపించలేదు. అయితే తాజాగా ఆయన ఒక సీక్రెట్ విషయాన్ని అభిమానులకు చెప్పేశాడు. మన క్రికెటర్లు కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ కి వెళ్తుంటారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గల్ఫ్‌ ఆయిల్ నిర్వహించిన కార్యక్రామానికి టీమ్ మేట్స్ తో కలిసి వెళ్లాడు ధోని.

who is MS Dhoni's first crush Do Know?

అయితే అక్కడ ఉన్న షో ప్రజెంటర్ క్రికెటర్లతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించాడు. క్రికెటర్ల మనసులో అనుకున్ననంబర్లు, పేర్లు చెప్పేయడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది. అలాగే ధోనిని కూడా నీ ఫస్ట్ క్రష్ పేరేంటో మనసులో తలచుకోండి.. నేను చెప్పేస్తాను అని షో ప్రజెంటర్ అన్నాడు. నీ ఫస్ట్ క్రష్ పేరులో ఏ అనే అక్షరం మూడో స్థానంలో ఉంటుందని చెప్పేశాడు. మొత్తానికి ఆమె పేరు స్వాతి అని ప్రేక్షకులకు చెప్పేశాడు మిస్టర్ కూల్. స్వాతిని 1999లో ఇంటర్ సెకండియర్ లో ఉన్నప్పుడు చూశానని చెప్పాడు. ఈ విషయాన్న తన భార్య సాక్షికి చెప్పొద్దంటూ జోక్ చేశాడు. ఈ మిస్టర్ కూల్ తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షిని 2010లో వివాహం చేసుకున్నాడు.

- Advertisement -