డయాబెటిస్‌..ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా!

1
- Advertisement -

నేటిరోజుల్లో చాలామంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య డయాబెటిస్. ప్రతి పదిమందిలో కనీసం ఇద్దరు మధుమేహంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిఏటా డయాబెటిస్ కారణంగా ప్రత్యేక్షంగానో లేదా పరోక్షంగానో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి సరైన వైద్యం కూడా అందుబాటులో లేనందువల్ల దీని బారిన పడితే బయటపడడం చాలా కష్టం. అయితే డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని అన్న దానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.

అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిందే. ఎందుకంటే ఉదయం స్నాక్స్ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. సరైన మోతాదులో అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

రోజు మొత్తంలో కొద్ది కొద్దిగా శరీరానికి కార్బోహైడ్రేట్లను అందేలా చూడాలని చెబుతున్నారు. లంచ్, డిన్నర్లలో ఒక్కసారే భోజనం లాగిస్తే రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతుందని, షుగర్ మందులు తీసుకున్నా సరే పరిస్థితి అదుపులో ఉండదని చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఒకేసారి పూర్తిగా శరీరానికి సరిపడ భోజనం చేయకుండా, తక్కువ పరిమాణంలో కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

శరీరానికి పోషకాలను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పండ్లు, ధాన్యాలు, కూరగాయలు, కొవ్వు తక్కువ మోతాదులో ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

- Advertisement -