‘మీనాక్షి చౌదరి’ పరిస్థితి ఏమిటో?  

60
- Advertisement -
ఎక్స్ పోజింగ్, హాట్ షోలతో సర్రున దూసుకువచ్చింది ఇండస్ట్రీలోకి మీనాక్షి చౌదరి. ఎలాగూ పాటలు, డ్యాన్స్ ల్లో అమ్మడు మంచి టాలెంట్ చూపిస్తోంది. ఇక బోల్డ్ సన్నివేశాలు ఉంటే.. శక్తికి మించి అందాల ఆరబోతకు తెరతీస్తోంది. వీటిన్నంటి దృష్ట్యా మీనాక్షి చౌదరికి చాలా తక్కువ సమయంలోనే ఏకంగా మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ వచ్చేసింది. ఆ మాటకొస్తే  మీనాక్షి పొజిషన్.. ఖిలాడి సినిమా ముందు వేరు. ఖిలాడి సినిమా తర్వాత వేరు. ఆ సినిమా మొత్తంలో మీనాక్షి చౌదరి గ్లామర్ హైలైట్ అవ్వడంతోటి  ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది.  
 
దాంతో,  మీనాక్షి చౌదరికి రోజుకు మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేంత డిమాండ్ వచ్చేసింది. సినిమాలే సినిమాలు. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా వచ్చింది. మహేష్ కి ఇష్టం లేకపోయినా  దర్శకుడు త్రివిక్రమ్ ఏరికోరి మరీ మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నాడు. ఆమె పాత్ర పై ఇప్పటికే చాలా రూమర్లు వినిపించాయి. మీనాక్షి గ్లామర్ కూడా సినిమాలో బాగా హైలైట్ అవుతుంది అని, కచ్చితంగా గుంటూరు కారం తర్వాత టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి మీనాక్షి చౌదరి చేరుతుంది అని టాక్ నడుస్తోంది. నిజానికి సడెన్ గా వచ్చిన క్రేజ్ ఎక్కువకాలం నిలబడదు. రోజులు గడిచే కొద్దీ కరిగిపోతూ ఉంటుంది.  
 
ఇలాంటి టైమ్ లో వస్తోంది గుంటూరు కారం. ఈ సినిమా మీద మీనాక్షి చౌదరికు పెద్ద ఆశలే ఉన్నాయి. కానీ, గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి ది జస్ట్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర మాత్రమే అని ఆ మధ్య నిర్మాత నాగవంశీ ముందే చెప్పేసారు. అందువల్ల ఆమె పాత్రలో  ఎక్కువ ఊహించుకోవడానికి కూడా లేదు. కాకపోతే, సినిమాలో ఎంత ఎక్స్ పోజ్ చేయాలో అంతా చేసేస్తే.. అది యూత్ కి బాగా నచ్చితే.. మీనాక్షి పేరు మళ్లీ వైరల్ అవుతుంది. లేదంటే.. సడెన్ గా వచ్చిన పాపులారిటీ సడెన్ గా పోతుంది. మరి మీనాక్షి చౌదరి ఏం చేస్తోందో చూడాలి.     
     
- Advertisement -