NBK:బాలకృష్ణ ఎక్కడ?

23
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. వైసీపీ అధినేత జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రచారం చేస్తుండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల క్యాంపెయిన్‌లో మునిగిపోయారు. అయితే ఈ ప్రచారంలో ఎక్కడా బాలకృష్ణ కనిపించడం లేదు.

త్వరలోనే బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడపీ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే టీడీపీకి సినీ గ్లామర్‌ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక త్వరలోనే చంద్రబాబు, పవన్, బాలకృష్ణ ఒకే వేదిక ద్వారా ప్రచారం చేస్తారని చెబుతున్నారు.

ఇక హిందుపూర్‌ నుండి మూడోసారి నిల్చున్న బాలయ్య…ఈసారి హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యపై వైసీపీ తరపున మహిళా అభ్యర్థి బరిలో ఉండగా ఈ నియోజకవర్గానికి ఇంఛార్జీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. బాలయ్యను ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు పెద్దిరెడ్డి. అయితే బాలయ్య ఎన్నికల క్షేత్రంలో దిగితే మాత్రం ఫ్యాన్స్‌కే కాదు టీడీపీ తమ్ముళ్లకు పండగే.

Also Read:జనగామ దళారుల దందాపై రేవంత్ ఫైర్

- Advertisement -