కాంగ్రెస్.. తేలేదేప్పుడు?

47
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో గత కొన్నాళ్లుగా టికెట్ల కుమ్ములాటలు విపరీతంగా జరుగుతున్నాయి. అసలే పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై జరుగుతున్న రగడ హస్తం పార్టీని తీవ్రంగా కలవర పరుస్తోంది. ఆశావాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన పార్టీ వాటి నుంచి సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 17 ననే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ మెదట భావించింది. కానీ ఎన్నికల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడడం అలాగే సీట్ల విషయంలో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరగడం వంటి కారణాలతో అభ్యర్థుల జాబితాలో జాప్యం చేస్తోంది హస్తం పార్టీ. .

అయితే అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటైన స్క్రినింగ్ కమిటీ ఇప్పటికే పలు మార్లు సమావేశం అయినప్పటికి అభ్యర్థులను ఫైనల్ చేయడంలో తుది నిర్ణయానికి రాలేకపోతుందట. ఎందుకంటే ఒక్కో నియోజిక వర్గంలో ప్రజాధరణతో సంబంధం లేకుండా ఇద్దరు నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారట. దీంతో వారినుంచి సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం స్క్రినింగ్ కమిటీకి పెద్ద టాస్క్ లా మారింది. దానికి తోడు ఎంపిక కానీ వారి నుంచి పార్టీకి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు అని ఇప్పటికే స్క్రినింగ్ కమిటీలోనూ సభ్యులు చెబుతున్నప్పటికి, సర్వేలలో కూడా వ్యతిరేక కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో వ్యతిరేక ఫలితలే వస్తున్నాయట. దీంతో తొలి జాబితా అభ్యర్థులను ఎన్నుకునే విషయంలో హస్తం పార్టీ తీవ్ర సందిగ్డంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు మరోసారి స్క్రినింగ్ కమిటీలోని సభ్యులు రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాక్రే వంటి వారు భేటీ కానున్నారు. మరి ఈ సమావేశంలో నైనా అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి వస్తారా ? అనేది చూడాలి.

Also Read:రైల్వే కూలీగా మారిన రాహుల్!

- Advertisement -