ఇలియానాకు వేధింపులు..!

172
Ileana D'cruz lashes out at male fan who misbehaved with her
- Advertisement -

గోవా బ్యూటీ.. ఇలియానా  దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిమితమయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది. అయితే, ఇటీవల ఓ పురుష అభిమాని ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడట.

Ileana-DCruz

ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన ఇలియానా.. నేను పబ్లిక్ ఫిగర్నే ఒప్పుకుంటాను. అలా అని మీకు నచ్చినట్లు మాట్లాడినా ప్రవర్తించినా దాన్ని అభిమానం అనే మేము భావించాలా? మేము మనుషులమే కదా. పైగా నేను ఒక ఆడదాన్ని. మనం ఎలాంటి మూర్ఖుల మధ్య బతుకుతున్నామో నాకు ఇప్పుడే అర్ధమవుతుంది. సినిమా స్టార్స్ కి బయట ఏకాంతం దొరకటం అసాధ్యమే అనే విషయం నాకు తెలుసు కానీ ఎవరికి  నచ్చినట్లుగా వాళ్ళు  పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం సరైన పద్దతి కాదు. ఇలా అంటున్నాను అని ఎవరు తప్పుగా అర్ధం చేసుకోకండి. ముఖ్యంగా అభిమానులు. నేను కొంతమంది మూర్ఖులు గురించి మాట్లాడుతున్నా” అని ట్వీట్ చేసింది ఈ గోవా సుందరి.

ప్రస్తుతం ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ హిందీ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది.  అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హష్మీ, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో మిలాన్‌ లుథ్రియా రూపొందించిన ఈ సినిమాపై ఇలియానా భారీ ఆశలే పెట్టుకుంది.

illeyana

- Advertisement -