వాట్సప్ గవర్నెన్స్ ..గేమ్ ఛేంజర్!

6
- Advertisement -

వాట్సప్ గవర్నెన్స్ ఓ గేమ్ ఛేంజర్ అన్నారు మాజీ సీఎం చంద్రబాబు. టీడీపీ మహానాడులో మాట్లాడిన చంద్రబాబు.. రూ.500 సహా పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయాలి అన్నారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక నోట్లు అవసరం లేదు… దీని వల్ల అవినీతి తగ్గుతుంది అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు అన్నారు.

ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక్క మేసేజ్ తో పనులు అయిపోతాయి… టెక్నాలజీ ద్వారా అవినీతి రహిత పాలన అందిస్తాం అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్కాముల లెక్కలు తీస్తున్నాం.. అవినీతిని కక్కిస్తాం అన్నారు. గత ఎన్నికల్లో అవినీతి పాలకులను ప్రజలు తరిమేసి.. అక్రమార్కులను శిక్షించే బాధ్యతను మనకు ఇచ్చారు… ప్రజా సంపదను దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకులు, అధికారులను ఉపేక్షించే సమస్యే లేదు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించి కడపను స్వీప్ చేస్తాం… రాయలసీమ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపేందుకు కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు. గతంలో మహానాడు అంటే వేడి వాతావరణం ఉండేదికానీ ఇప్పుడు చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణంలో మహానాడు జరుపుకుంటున్నాం అన్నారు.

ఏ పార్టీలో చూసినా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారు… టీడీపీకి ఓ బ్రాండ్ ఉంది అన్నారు. నీతి, నిజాయితీ రాజకీయాలు చేస్తాం…ఒక విజన్ తో పని చేస్తాం అన్నారు పీక కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలిపెట్టాడు మన పసుపు సింహం చంద్రయ్య అన్నారు. పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది…. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్నారు. ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు
…వెంటాడి వేటాడి చంపారు, అక్రమ కేసులు పెట్టారు కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన టీడీపీ కార్యకర్తలను అభినందిస్తున్నా అన్నారు చంద్రబాబు.

Also Read:థియేటర్లు..పవన్ కీలక సూచన

- Advertisement -