ఇకపై ఈ ఫోన్లలో వాట్సాప్‌ పని చేయదు..!

578
watsup
- Advertisement -

వాట్సాప్‌ అనేది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. దీని ద్వారా మెసేజ్ లను త్వరగా పంపవచ్చు. ఇవే కాకుండా వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. ఇలాంటి ఫీచర్లను కలిగి ఉన్న వాట్సాప్‌ ఒక్కసారిగా పనిచేయదు అంటే మీకు ఎలా ఉంటుంది. కానీ ఇది నిజం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుండి ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్‌లలో ఇకపై వాట్సాప్ నిలిచిపోనుంది. ఒకవేల ఆ తరువాత కూడా వాట్సాప్‌ వినియోగించాలి అనుకుంటే ఆండ్రాయిడ్ 10 తాజా వెర్షన్ ను అప్డేట్ చేయాలి.

ఇప్పటికే కొన్నిపాత ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోగా..త్వరలో మరికొన్ని మొబైల్స్‌లోనూ నిలిపేసేందుకు సన్నాహాలు చేస్తోంది వాట్సాప్‌‌. ఈ వివరాలను తన బ్లాగ్‌లో పేర్కొంది వాట్సాప్‌. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 2,3,7 కన్నాతక్కువ వర్షన్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంటే మీ ఫోన్‌లో వాట్సాప్‌ పనిచేయదు. అలాగే ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఓఎస్ ఉన్నా ఇదే పరిస్థితి. దీంతో ఈ ఫోన్లు వాడుతున్నవాళ్లు వెంటనే తమ డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది.

whatsapp-reuters

ఇక 2019 డిసెంబర్ 31 నుంచి అన్ని విండోస్ ఫోన్లల్లో వాట్సాప్‌ ఆగిపోతుంది. ఐతే ఇంకా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య చాలా తక్కువని..అందుకే పాత ఓఎస్ ఉన్న ఫోన్లకు సేవల్ని నిలిపివేస్తే ఎక్కువ మందిపై ప్రభావం ఉండదని చెబుతోంది. ఇక జియో ఫోన్ వినియోగదారులు ఈ అప్ డేట్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. Kai ఆపరేటింగ్ సిస్టం 2.5.1కు పైన నడిచే అన్ని మొబైల్స్ లోనూ వాట్సాప్ పనిచేయనుంది.

- Advertisement -