ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ న్యూ ఇయర్ సందర్భంగా యూజర్లకు షాక్ ఇచ్చింది.
విండోస్ మొబైల్స్‌లో వాట్సాప్ వాడే వారికి ఇక వాట్సాప్ పనిచేయదు. 31 డిసెంబరు 2019 తర్వాత విండోస్ ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్టు ఇప్పటికే వాట్సాప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
విండీస్ ఫోన్లతో పాటు పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్లకు కూడా త్వరలో వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. యాపిల్ ఐఫోన్ ఐఓఎస్ 8 ఫోన్లతోపాటు 2.3.7 ఆండ్రాయిడ్ వెర్షన్లపై పనిచేసే ఫోన్లలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ నిలిచిపోనుంది. యూజర్ల భద్రత కోసమే ఈ మొబైల్స్‌లో వాట్సాప్ బ్యాన్ చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.