వాట్సాప్‌కు 7 రోజుల గడువు ఇచ్చిన కేంద్రం…

145
WhatsApp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్…ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన కొత్త విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలుమార్లు వాట్సాప్‌కు ప్రైవసీ పాలసీపై తన విధానాన్ని తేల్చిచెప్పిన కేంద్రం…తాజాగా మరోసారి కొత్త ప్రైవ‌సీ పాల‌సీని ఉప‌సంహ‌రించు కోవాల్సిందేన‌ని స్ప‌ష్టంచేసింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ

పాలసీ ఉందని…ఈ మేర‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీస్ పంపించింది. ఈ మేరకు ఏడు రోజుల గడువు ఇవ్వగా ఆ గడువులోగా స్పందించకపోతే చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. భారతీయ యూజర్లపై అనుచితమైన నిబంధనలు, షరతులను విధించేందుకు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకోవడం వాట్సాప్ బాధ్యతారాహిత్యమని ప్రభుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

- Advertisement -